Page Loader
నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి
నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు

నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి

వ్రాసిన వారు Stalin
Jan 13, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 50మంది యాత్రికులతో ఠాణె నుంచి షిర్డీకి బస్సు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మరణించిన పది మందిలో ముగ్గురు పురుషులు, ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. అయితే గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సీఎం షిండే ట్వీట్

రోడ్డు ప్రమాదం

బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను త్వరగా షిర్డీలోని ఆసుపత్రులకు తరలించి, వారికి సరైన చికిత్స అందించాలన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని సీఎం షిండే అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 2022లో జనవరి- సెప్టెంబర్ మధ్య మహారాష్ట్రలో 24,360 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు రాష్ట్ర రవాణా శాఖ నివేదకలు చెబుతున్నాయి. 2022లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం 11,149 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021తో పోలిస్తే 2022లో 1,272 ఎక్కువ మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.