Loading...
Vijayawada: విష ప్రచారం ఆపకుంటే ఊరుకోం.. వైసీపీపై డీఎస్సీ విజేతల ఫైర్
విష ప్రచారం ఆపకుంటే ఊరుకోం.. వైసీపీపై డీఎస్సీ విజేతల ఫైర్

Vijayawada: విష ప్రచారం ఆపకుంటే ఊరుకోం.. వైసీపీపై డీఎస్సీ విజేతల ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీసీ తమపై చేస్తున్న విష ప్రచారాన్ని ఆపకపోతే తీవ్రంగా స్పందిస్తామని మెగా డీఎస్సీ-2025 విజేతలు హెచ్చరించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో డీఎస్సీ విజేతల ఆధ్వర్యంలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. దీంతో నగరంలో ర్యాలీ సందడి నెలకొంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ స్మృతివనం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు 7 వేల మంది పాల్గొన్నారు.

వివరాలు

'కష్టపడి ఉద్యోగం సాధించాం'

తమ ప్రతిభ, కష్టంతో ఉద్యోగాలు సాధించామని.. అలాంటి తమను వైసీపీ అవమానించేలా ప్రచారం చేస్తోందని డీఎస్సీ విజేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ చేస్తున్న విష ప్రచారం కారణంగా ఉద్యోగం సాధించిన ఆనందాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఇకపై ఎలాంటి ప్రచారం చేసినా సహించమని హెచ్చరించారు. విష ప్రచారాన్ని మానుకోకపోతే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పలు జిల్లాల్లో ర్యాలీలు

వైసీపీ ప్రచారానికి వ్యతిరేకంగా డీఎస్సీ విజేతలు ఇప్పటికే ఆందోళనలకు దిగుతున్నారు. కర్నూలు, తిరుపతి సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మెగా డీఎస్సీ-2025 విజేతల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT