
AP Rains: అల్పపీడనంగా బలహీనపడిన తీవ్ర అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ముసురు కనిపిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది.అయితే ఈరోజు ఉదయం అది అల్పపీడనంగా బలహీనపడింది.
ప్రస్తుతం ఆ అల్పపీడనం మరింత బలహీనమై ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది.
దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 65కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోర్టులకు 3వనంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
ఈసందర్భంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కొనసాగుతున్నప్పటికీ, నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.