LOADING...
Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే, కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మరింత బలపడుతూ, త్వరలోనే తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వివరించారు.

వివరాలు 

నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు 

ఈ రోజు రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్-మాల్కాజ్‌గిరి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం వర్షాలు నమోదయ్యాయి. పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, తార్నాక, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. తార్నాక - ఉప్పల్ మార్గంలో వర్షం వల్ల రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం పడుతున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద చాలామంది వాహనదారులు కాసేపు ఆగి, వర్షం తగ్గిన తర్వాత ప్రయాణం కొనసాగించారు.