Page Loader
Weekly Dress Code: చండీగఢ్‌లో విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వీక్లీ డ్రెస్‌కోడ్‌
చండీగఢ్‌లో విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వీక్లీ డ్రెస్‌కోడ్‌

Weekly Dress Code: చండీగఢ్‌లో విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వీక్లీ డ్రెస్‌కోడ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రోజూ యూనిఫాం ధరించినట్లే, ఇప్పుడు అదే తరహాలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకూ వారానికి ఒక్కరోజు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని చండీగఢ్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాబోయే సోమవారం నుంచే చండీగఢ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ ఈ విధిగా నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఉపాధ్యాయులలో వృత్తిపరమైన ప్రవర్తన, ఏకీకృత దృశ్య ప్రతిబింబం, సమానత్వ భావన పెంపొందించడమే ఈ చర్యకు ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

వివరాలు 

ప్రత్యేక మార్గదర్శకాలు

వారానికి ఒక్కరోజు.. సోమవారం నాడు, పురుష, మహిళా ఉపాధ్యాయులు తగినట్టు దుస్తులు ధరించాలని సూచిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు ప్రకటించారు. పురుష ఉపాధ్యాయులు: నీలిరంగు ఫార్మల్ షర్ట్,బూడిద రంగు ప్యాంటు తప్పనిసరిగా ధరించాలి. మహిళా ఉపాధ్యాయులు: గోధుమ రంగు చీర లేదా మెరూన్ అంచు కలిగిన సల్వార్-కమీజ్‌ ధరించాలి. పురుష ప్రిన్సిపాల్స్‌: తెల్ల రంగు చొక్కా,బూడిద రంగు ప్యాంటు వేసుకోవాలి. మహిళా ప్రిన్సిపాల్స్‌: లేత గోధుమరంగు చీర లేదా బంగారు అంచు కలిగిన సల్వార్-కమీజ్‌ ధరించాల్సి ఉంటుంది. ఈ విధంగా డ్రెస్ కోడ్ అమలుతో పాఠశాలల్లో వృత్తిపరమైన సమిష్టి గుర్తింపుతో కూడిన నియమిత వాతావరణం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. సోమవారం నుండి ఎలాంటి మినహాయింపులు లేకుండా ఈనిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.