West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అయితే, తన సమావేశం ప్రోటోకాల్ మీటింగ్ మాత్రమేనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇది రాజకీయ సమావేశం కాదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి లేదా ప్రధాని పర్యటనకు వస్తే సీఎం వారిని కలవాలన్నది ప్రోటోకాల్ అని ఆమె తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం లక్ష కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని రాష్ట్రం ఆరోపిస్తున్న తరుణంలో మమతా బెనర్జీ ప్రధానితో భేటీ కావడం గమనార్హం. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై గతంలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.