NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య 
    తదుపరి వార్తా కథనం
    West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య 
    టీఎంసీ నేత సహా మరొకరి హత్య

    West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 13, 2023
    02:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు టీఎంసీ నేత స్థానిక పంచాయతీ సభ్యుడు సైఫుద్దీన్ లష్కర్ సహా మరో వ్యక్తి హత్యకు గురయ్యారు.

    దక్షిణ 24 పరగణాస్‌లోని జాయ్‌నగర్‌లో సోమవారం తెల్లవారుజామున తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడితో సహా మరో వ్యక్తి దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

    మరోవైపు సైఫుద్దీన్ భార్య పంచాయతీ హెడ్‌(సర్పంచ్)గా ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. అయితే కాల్పుల శబ్దంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు దుండగులను వెంబడించారు. ఈ క్రమంలోనే సదరు ముఠాలో ఒకరిని పట్టుకున్నారు.

    దీనిపై స్పందించిన పోలీసులు, ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపారు.ఈ మేరకు విచారణ ప్రారంభించామన్నారు.

    కేసులో భాగంగా ఒక వ్యక్తిని అరెస్టు చేశామని బరుయ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.

    details

    వ్యక్తిగత వైరమా లేక రాజకీయ వైరుధ్యమా అనే కోణంలో దర్యాప్తు

    శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఓ ముఠా అతని ఇంటి ముందు అడ్డగించి కాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. ఫలితంగా అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు.

    అయితే గ్రామస్తులకు వెంబడించిన క్రమంలో ముఠాలోని ఓ వ్యక్తి వీరికి చేతికి చిక్కాడని, దీంతో ఆగ్రహావేశాలతో సదరు వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారని పోలీసులు స్పష్టం చేశారు.

    ఆ తర్వాత అదే జిల్లాలోని ఉస్థి ప్రాంతానికి చెందిన మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

    అయితే జంట హత్యలు ఎందుకు జరిగాయి, ఇందులో వ్యక్తిగత వైరం కారణమా లేక రాజకీయ వైరుధ్యమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    హత్య

    తాజా

    Sharmishta Panoli: శ‌ర్మిష్ట ప‌నోలికి కోల్‌క‌తా హైకోర్టులో ఊర‌ట.. తాత్కాలిక బెయిల్ మంజూరు  కోల్‌కతా
    Rafale: మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు.. టాటా, డసో మధ్య ఒప్పందం హైదరాబాద్
    ENG vs IND: భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ ఇంగ్లండ్
    Amazon India: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకపై ప్రతి ఆర్డర్ రూ.5 అదనంగా చెల్లించాలి.. అమెజాన్‌

    పశ్చిమ బెంగాల్

    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే ఐఎండీ
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తుపాను
    బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ సౌరబ్ గంగూలీ
    'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే  కేరళ

    హత్య

    Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు  రాజస్థాన్
    అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట ఆంధ్రప్రదేశ్
    మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు  మణిపూర్
    Delhi: యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025