
పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి దాఖలు చేసిన పిటషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రసవానంతర డిప్రెషన్‌తో సహా ఆరోగ్య సమస్యలతో గర్భిణి బాధపడుతూ.. మూడో బిడ్డ పోషించడం కష్టమమవుతోందని ఓ మహిళ అబార్షన్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు అబార్షన్‌కు అనుమతిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. అబార్షన్ చేయాల్సిందిగా ఎయిమ్స్‌ను ఆదేశించింది.
ఈ క్రమంలో కడుపులోని పిండం ఆరోగ్యంగా ఉన్నట్లు, అబార్షన్ చేయడం వల్ల ఒక చిన్నారి ప్రాణాలను తీసినట్లు అవుతుందని ఎయిమ్స్ వైద్యులు ఏఎస్‌జీ ఐశ్వర్య భాటి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఎస్‌జీ ఐశ్వర్య భాటి ఇదే విషయాన్ని సీజఐ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు.
సుప్రీంకోర్టు
పిండం ఆరోగ్యంగా ఉందని మొదటి నివేదికలో ఎందుకు చెప్పలేదు: ధర్మాసనం
ఈ కేసును జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు.
విచారణ సందర్భంగా ధర్మానసం ఎయిమ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిండం బతికే అవకాశం ఉందని ముందు ఇచ్చిన నివేదికలో ఎందుకు చెప్పలేదని ఎయిమ్స్‌ను జస్టిస్ కోహ్లి ప్రశ్నించారు.
ఆబార్షన్‌కు సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత.. మళ్లీ నివేదికను మర్చి ఎందుకు ఇచ్చారని అడిగారు.
ఏ కోర్టు కూడా కావాలని పిండం గుండె చప్పుడును ఆపాలనుకోదని జస్టిస్ హిమా కోహ్లి అన్నారు.
సోమవారం నాటి విచారణలో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.
చివరికి ఈ కేసు విచారణలో జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ నాగరత్న మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో సీజేఐకి సిఫార్సు చేశారు.