HKU1:"ఊపిరి పిలుచుకోడానికి కూడా టైం ఇయ్యట్లేదు"..మార్కెట్ లోకి మరో కొత్త వైరస్..కోల్‌కతా మహిళకు పాజిటివ్..లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా కొత్త రకాల వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ తర్వాత కొత్త కొత్త వేరియంట్లు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా భారతదేశంలో మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ కొత్త వైరస్ కోల్‌కతాలో ఒక మహిళకు నిర్ధారణ అయ్యింది.
సోమవారం, 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనావైరస్ HKU1 సోకినట్లు నిర్ధారణ అయింది.
ఆమె గత 15 రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
అయితే, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
వివరాలు
మహమ్మారి రూపం దాల్చే అవకాశాలు తక్కువ
కోల్‌కతాలో ఒక మహిళకు అత్యంత అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ (HKU1) నిర్ధారణ కావడంతో కొంత భయం నెలకొంది.
ప్రస్తుతం ఆమెను ఐసొలేషన్‌లో ఉంచి వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. HKU1 సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుందని, ఇది మహమ్మారి రూపం దాల్చే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు తెలిపారు.
ఈ వైరస్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదా వ్యాక్సిన్ లేదు. ఇది 'బీటా కరోనా వైరస్ హాంకానెన్స్' గ్రూప్‌కు చెందినదని వైద్యులు పేర్కొన్నారు.
HKU1 కూడా సాధారణ మానవ కరోనావైరస్‌లలో ఒకటి. ఇది తేలికపాటి నుండి మితమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది.
వివరాలు
కోవిడ్-19 సమయంలో పాటించిన జాగ్రత్తలు
229E, NL63, OC34 వంటి ఇతర కరోనా వైరస్‌ల మాదిరిగానే ఇది కూడా జలుబుతో పాటు కొన్ని తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను కలిగించవచ్చు.
ఈ వైరస్ లక్షణాలు ముక్కు కారటం,గొంతు నొప్పి,తలనొప్పి, జ్వరం,దగ్గుగా ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది న్యుమోనియా లేదా బ్రోన్కైటిస్‌కు కూడా కారణం కావచ్చు.
ఈ వైరస్ వల్ల హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు,రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, శిశువులు,కొమొర్బిడిటీలు ఉన్న వృద్ధులు ఎక్కువగా ప్రమాదంలో ఉంటారు.
HKU1ని నివారించేందుకు కోవిడ్-19 సమయంలో పాటించిన జాగ్రత్తలు ఉపయోగపడతాయి.
చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవడం,కడుక్కోని చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరంగా ఉండడం,తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం,వస్తువులను శుభ్రం చేయడం వంటి చర్యలు తీసుకోవాలి.
వివరాలు
మహమ్మారి స్థాయికి చేరుకునే అవకాశాలు లేవు
HKU1 కోసం ప్రత్యేకమైన టీకా లేదా ఔషధం లేదు. అయితే, సాధారణ జలుబు కోసం తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి.
బాగా విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు తాగడం, పండ్ల రసాలు, పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. ఎక్కువ శాతం ప్రజలు స్వయంగా కోలుకుంటారు.
కానీ, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే లేదా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం.
HKU1 వైరస్ కొత్తదైనా, ప్రస్తుతానికి ఇది మహమ్మారి స్థాయికి చేరుకునే అవకాశాలు లేవు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీనిని కూడా నిరోధించవచ్చు.