LOADING...
Andhra news: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.18కే గోధుమ పిండి...! 
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.18కే గోధుమ పిండి...!

Andhra news: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.18కే గోధుమ పిండి...! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలోని రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంతోషకర సమాచారం అందింది. ఇకపై పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో కిలో గోధుమపిండిని రూ.18కి అందజేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభించింది. జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేశారు. జనవరి 1 నుంచి ప్రతి కుటుంబానికి కిలో గోధుమపిండి అందించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన గోధుమపిండిని మాత్రమే అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం అందిస్తున్న వస్తువులతో పాటు రేషన్ కార్డుదారులు రూ.18చెల్లించి కిలో గోధుమపిండిని కూడా పొందగలరు.

వివరాలు 

ఈ-కేవైసీ తప్పనిసరి 

తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు అందుకోని వారికి కూడా కొత్త కార్డులు జారీ చేస్తున్నారు. కొత్త దరఖాస్తులను కూడా అధికారులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ-కేవైసీ పూర్తి చేయని కార్డులను నిర్ధారించి తొలగించే చర్యలు చేపడుతున్నారు. రేషన్ పంపిణీ కేంద్రాల నుండి సమయానుసారం సమాచారం సేకరించడం కొనసాగుతోంది. అనేక జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. స్మార్ట్ రేషన్ కార్డులు పొందినప్పటికీ, ఇంకా చాలామంది లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే, వారి రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుడిని ధృవీకరించే విధానాన్నే ఈ-కేవైసీ అంటారు. దీని ద్వారా నకిలీ రేషన్ కార్డులను గుర్తించి తొలగించవచ్చు.

వివరాలు 

పారదర్శకతకు ఈ-కేవైసీ కీలకం 

ఈ-కేవైసీ ప్రక్రియను కచ్చితంగా నిర్వహించడం వల్ల నకిలీ లబ్ధిదారులను తొలగించవచ్చు. సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుంది. నిజమైన అర్హులకే లబ్ధి చేరుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందుకే అధికారులు నిరంతరం ఈ-కేవైసీ వివరాలను సేకరిస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రేషన్ డీలర్ షాప్‌లోనే లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ సదుపాయం ఉంది. ఈ-పోస్ (E-PoS) యంత్రంలో వేలిముద్రను స్కాన్ చేసిన వెంటనే ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఇప్పటివరకు రేషన్ కార్డు పొందని వారు తమకు కేటాయించిన రేషన్ షాపుకు వెళ్లి కార్డులను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.