Page Loader
Pilibhit Tiger: గ్రామంలో గోడపై పులి హల్‌చల్.. రాత్రంతా గోడపైనే.. 
Pilibhit Tiger: గ్రామంలో గోడపై పులి హల్‌చల్.. రాత్రంతా గోడపైనే..

Pilibhit Tiger: గ్రామంలో గోడపై పులి హల్‌చల్.. రాత్రంతా గోడపైనే.. 

వ్రాసిన వారు Stalin
Dec 26, 2023
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ పిలిభిత్‌లోని అత్కోనా గ్రామంలో పులి హల్ చల్ చేసింది. పొలాల్లో సంచరిస్తున్న పులి సోమవారం రాత్రి ఓ రైతు ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థుల వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. పులి గోడపైనే రాత్రింతా విశ్రమించింది. చుట్టూ ఉన్న జనాలను చూసి ఆ పులి ఎటూ వెళ్లలేక మంగళవారం ఉదయం వరకు గోడపైనే ఉండిపోయింది. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు వలలు ఏర్పాటు చేశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి అధికారులు పులిని పట్టుకున్నారు. పులి గోడపై తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గోడపై పులి