తదుపరి వార్తా కథనం

Passengers jump from the moving Train: రైలులో మంటలంటూ వదంతులు.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 11, 2024
03:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి, బ్రిడ్జిపై నుంచి ప్రయాణికులు దూకేశారు.
ఈ నేపథ్యంలో 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకారు.
ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా, 12 మందికి గాయాలయ్యాయి.
ఈ ఘటన హౌరా నుంచి అమృత్‌సర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Details
బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం
జనరల్ కోచ్‌లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో ఈ గందరగోళం తలెత్తిందని రైల్వే సిబ్బంది తెలిపారు.
మంటలను ఆర్పే యంత్రాల ద్వారా కోచ్‌లో పొగలు వ్యాపించాయని అధికారులు నిర్ధారించారు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఖచ్చితమైన కారణం కనుగోనడానికి, బాధ్యులను గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించిందని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు.