Page Loader
Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?
Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యపై మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?

Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?

వ్రాసిన వారు Stalin
Jan 14, 2024
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రోజు కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్య రామాలయ నిర్మాణ ప్రయాణంలో 14 జనవరి 1992వ తేదీకి ప్రత్యేకమైన స్థానం స్థానం ఉంది. దాదాపు 32ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ.. ఇదే రోజున ఒక ప్రతిజ్ఞ చేశారు. 1992లో ఇదే రోజున నరేంద్ర మోదీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏక్తా యాత్రలో భాగంగా అయోధ్యలోని రామజన్మభూమికి వచ్చారు. ఆ సమయంలో శ్రీరాముడి విగ్రహం టెంట్ కింద ఉండేది. ఈ క్రమంలో టెంట్ కింద ఉన్న శ్రీరాముడినే మోదీ దర్శించుకున్నారు.

మోదీ

32ఏళ్ల తర్వాత నెరవేరుతున్న మోదీ సంకల్పం

టెంట్ కింద ఉన్న శ్రీరాముడి దర్శించుకున్న సమయంలో మోదీని ఓ విలేకరి ఓ ప్రశ్న అడిగాడు. మళ్లీ అయోధ్యకు ఎప్పుడొస్తారని 32ఏళ్ల విలేకరి అడగ్గా.. శ్రీరాముడి గుడి కట్టిన తర్వాతే తిరిగి వస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే ఆగస్ట్ 5, 2020న అయోధ్య రామాలయ భూమి పూజ కోసం ప్రధాని హోదాలో అయోధ్యకు వచ్చారు. 32 ఏళ్ల తర్వాత.. ఆ నాటి నరేంద్ర మోదీ సంకల్పం నెరవేరింది. రామజన్మభూమిలో శ్రీరాముడి కోసం గొప్ప ఆలయం సిద్ధంగా ఉంది. 1992లో ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్, అప్పటి గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీ మనోహర్ జోషితో కలిసి నరేంద్ర మోదీ ఏక్తా యాత్ర చేపట్టారు.