Loading...
Devendra Nath Mahto: జార్ఖండ్ 'సోనం వాంగ్‌చుక్'గా మారిన దేవేంద్ర నాథ్ మహతో ఎవరు?
జార్ఖండ్ 'సోనం వాంగ్‌చుక్'గా మారిన దేవేంద్ర నాథ్ మహతో ఎవరు?

Devendra Nath Mahto: జార్ఖండ్ 'సోనం వాంగ్‌చుక్'గా మారిన దేవేంద్ర నాథ్ మహతో ఎవరు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లో ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఈ ఉద్యమానికి విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ప్రధాన ముఖచిత్రంగా నిలిచారు. విద్యార్థుల హక్కుల కోసం చేపట్టిన ఆయన నిరవధిక నిరాహార దీక్ష కారణంగా పలువురు ఆయనను "జార్ఖండ్ సోనం వాంగ్‌చుక్"గా అభివర్ణిస్తున్నారు. ఆగస్టు 2 రాత్రి రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఆయన నిరవధిక దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాహార దీక్షే చివరి మార్గమని మహతో ప్రకటించారు.

వివరాలు 

నియామక ప్రక్రియపై సీబీఐ,ఈడీ విచారణ

విద్యార్థులు ప్రధానంగా 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(JPSC)ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి, మొత్తం నియామక ప్రక్రియపై సీబీఐ,ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

నియామకాల్లో పూర్తి పారదర్శకత,నిష్పక్షపాత విధానం అమలు చేసే వరకు పరీక్షను రద్దు చేయాలని మహతో స్పష్టం చేశారు.

రాంచి సమీపంలోని ఓ చిన్నగ్రామానికి చెందిన దేవేంద్ర నాథ్ మహతో విద్యార్థి ఉద్యమాల్లో దశాబ్దకాలంగా చురుకుగా పాల్గొంటున్నారు.

బుందూలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన,రాంచీలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు.

సంస్కృతంతో పాటు కుర్మాలి,గిరిజన,ప్రాంతీయ భాషల్లో పీజీ పూర్తి చేశారు.హజారీబాగ్‌లో బీఈడ్ కూడా చేశారు.

2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.

వివరాలు 

ఉద్యమానికి మద్దతు ప్రకటించిన వివిధ విద్యార్థి సంఘాలు,కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)  

2015 నుంచి విద్యార్థి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న మహతో స్కాలర్‌షిప్‌లు,ప్రశ్నాపత్రాల లీకులు, నియామక నిబంధనలు, రిజర్వేషన్ విధానం వంటి అనేక అంశాలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి వివిధ విద్యార్థి సంఘాలతో పాటు కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) కూడా మద్దతు ప్రకటించింది.

పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వీడియో కాల్ ద్వారా మహతోతో మాట్లాడి సంఘీభావం తెలిపారు.

తన తాజా సోషల్ మీడియా పోస్టులో మహతో, "జూలై 5న ప్రారంభమైన ఉద్యమం.. జూలై 25 నుంచి పగలు-రాత్రి నిరంతర సత్యాగ్రహంగా కొనసాగుతోంది. ఇప్పుడు అది అత్యంత కీలక దశకు చేరుకుంది" అని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఉద్యమాన్ని శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా కొనసాగించాలి: మహతో 

శారీరకంగా బలహీనత ఉన్నా, విద్యార్థులకు న్యాయం చేయాలన్న సంకల్పం మరింత బలపడింది" అని పేర్కొన్నారు.

ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా కొనసాగించాలని ఆయన మద్దతుదారులను కోరారు.

ఇది ఒక వ్యక్తి కోసం కాదు, లక్షలాది యువత భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని చెప్పారు.

ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ (NEET) పరీక్షల ఆందోళనలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ పాల్గొనడంతో ఆ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది.

జూన్ 28న ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించగా, దేశవ్యాప్తంగా విద్యార్థుల మద్దతు పెరిగింది.

26 రోజుల దీక్ష అనంతరం కేంద్ర ప్రభుత్వం పరీక్షల సంస్కరణలపై లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో జూలై 23న ఆయన దీక్ష విరమించారు.

ADVERTISEMENT

వివరాలు 

JPSC, JSSC పరీక్షల్లో అక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ కూడా నెరవేరింది.

జార్ఖండ్‌లో జూలై 25 నుంచి వేలాది మంది విద్యార్థులు JPSC, JSSC పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు.

ముఖ్యంగా జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఓఎంఆర్ షీట్లలో మార్పులు, ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయని ఆరోపణలు వెలువడ్డాయి.

గతంలో ఇతర ప్రభుత్వ సంస్థలు బ్లాక్‌లిస్ట్ చేసిన TDPL సంస్థకే పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై కూడా విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

భవిష్యత్తులో నియామకాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్ 

అంతేకాకుండా 2024 జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం, హైకోర్టు జోక్యంతో పరీక్షను మళ్లీ నిర్వహించడం, జార్ఖండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోటీ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీక్ ముఠా బట్టబయలవడం, ఒక్కో అభ్యర్థి రూ.15 లక్షల వరకు చెల్లించి లీకైన ప్రశ్నలు కంఠస్థం చేసిన ఘటనలు కూడా విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.

అలాగే 2025 జేఏసీ పదో తరగతి సైన్స్, హిందీ ప్రశ్నాపత్రాలు పరీక్షల సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొన్ని జిల్లాల్లో పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది.

ఈ పరిణామాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో నియామకాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన దేవేంద్ర మహతో

ADVERTISEMENT