
Bengaluru Roads: బెంగళూరు రోడ్లపై విదేశి బిజినెస్ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందిపడిన కిరణ్ మజుందార్ షా
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు రోడ్లు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రముఖ ఔషధ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఈ సమస్యపై స్పందించారు. ఆమె బయోకాన్ పార్క్ ఆఫీస్లో జరిగిన ఒక సందర్భంలో, విదేశీ వ్యాపారవేత్తల వ్యాఖ్యలతో ఇబ్బందిపడ్డారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ట్యాగ్ చేసి షేర్ చేశారు.
వివరాలు
బెంగళూరు రోడ్లపై గతంలోనూ వ్యాపారవేత్తలు చేసిన వ్యాఖ్యలు వైరల్
''ఇటీవల ఒక విదేశీ వ్యాపారవేత్త బయోకాన్ పార్క్ సందర్శన కోసం వచ్చారు. ఆ సమయంలో ఆ వ్యక్తి నన్నుఅడిగారు: 'రోడ్లు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి? చుట్టుపక్కల ఎందుకు అంత చెత్త ఉంది? పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలనుకోవట్లేదా? నేను చైనా నుండి వచ్చాను. ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నా, ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేద'ని అన్నారు'' అని మజుందార్ షా తన పోస్టులో పేర్కొన్నారు. భారీ వర్షాలు, నిర్వహణ లోపాల కారణంగా బెంగళూరు రోడ్లపై గతంలోనూ వ్యాపారవేత్తలు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే
వివరాలు
స్పందించిన కర్ణాటక మంత్రి..
''గతంలో ఇంటి నుండి కార్యాలయానికి చేరుకోవడం సులభం. కానీ ఇప్పుడు అది కష్టమైంది. మా ఉద్యోగులు ఆఫీసుకు రావడానికి సగం గంటకు పైగా పడుతుంది. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో నిండాయి. గత ఐదు సంవత్సరాల్లో ఈ పరిస్థితిలో మార్పు లేదు. అందుకే మేము ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం''అని బ్లాక్‌బక్' కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. కిరణ్ మజుందార్ చేసిన పోస్ట్‌పై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ''వారు బెంగళూరులో ఏ ప్రాంతాన్ని సందర్శించారో నాకు ఖచ్చితంగా తెలియదు. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల విషయంలో ఏది అవసరమో దాన్ని చురుకైన విధంగా అందిస్తున్నాం'' అని బదులిచ్చారు.
వివరాలు
'మిషన్ ఫ్రీ ట్రాఫిక్ - 2026'
ఇవే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఈ విమర్శల నేపథ్యంలో 'మిషన్ ఫ్రీ ట్రాఫిక్ - 2026' ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో 90 రోజుల్లో 1600 కి.మీ. రోడ్లకు మరమ్మతులు, పునరుద్ధరణలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ఫలితంగా 2026 మార్చి నాటికి కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.