Loading...
HAL: తేజస్‌ మార్క్‌-1ఏ విమానాల సరఫరాలో జాప్యం.. హెచ్‌ఏఎల్‌పై విమర్శలు
తేజస్‌ మార్క్‌-1ఏ విమానాల సరఫరాలో జాప్యం.. హెచ్‌ఏఎల్‌పై విమర్శలు

HAL: తేజస్‌ మార్క్‌-1ఏ విమానాల సరఫరాలో జాప్యం.. హెచ్‌ఏఎల్‌పై విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ రక్షణ రంగంలో స్వదేశీ యుద్ధ విమానాల తయారీపై మరోసారి చర్చ మొదలైంది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) తయారు చేస్తున్న తేజస్‌ మార్క్‌-1ఏ యుద్ధ విమానాల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత వైమానిక దళానికి (IAF) ఈ విమానాలను సకాలంలో అందించడంలో హెచ్‌ఏఎల్‌ విఫలమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విమానాల తయారీ, వివిధ పరికరాల అమరిక, వైమానిక దళానికి అప్పగించే ప్రక్రియ నెమ్మదిగా సాగడంపై మాజీ వైమానిక దళాధిపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు న్యూస్‌9 లైవ్‌ కథనం వెల్లడించింది.

వివరాలు 

మిగ్‌-21 విమానాల స్థానంలో తేజస్‌ రావాల్సి ఉండగా..

భారత వైమానిక దళ ఆధునికీకరణలో తేజస్‌ మార్క్‌-1ఏ విమానాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇప్పటికే కాలం చెల్లిన మిగ్‌-21 యుద్ధ విమానాలను దశలవారీగా తొలగించి, వాటి స్థానంలో తేజస్‌ విమానాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

మిగ్‌-21 విమానాలు వైమానిక దళం నుంచి వైదొలగిన వెంటనే కొత్త తేజస్‌ స్క్వాడ్రన్లు అందుబాటులోకి రావాలన్నది అసలు లక్ష్యం.

అయితే అనుకున్న సమయానికి తేజస్‌ విమానాలు అందుబాటులోకి రాకపోవడంతో పరిస్థితి తారుమారైంది.

పాత విమానాలు వేగంగా సేవల నుంచి వైదొలుగుతుంటే.. వాటి స్థానంలో కొత్త విమానాలు చేరడం లేదు.

దీంతో భారత వైమానిక దళంలో పనిచేస్తున్న యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వివరాలు 

అమెరికా ఇంజిన్ల సరఫరాలోనే ప్రధాన సమస్య!

తేజస్‌ మార్క్‌-1ఏ విమానాల తయారీలో జాప్యానికి హెచ్‌ఏఎల్‌ ఒక్కటే కారణం కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కీలకమైన విమాన విడిభాగాల కోసం విదేశీ సంస్థలపై ఆధారపడటం కూడా సమస్యగా మారిందని న్యూస్‌9 లైవ్‌ పేర్కొంది.

ముఖ్యంగా అమెరికాకు చెందిన జీఈ (GE) సంస్థ తయారు చేసే ఎఫ్‌404 (F404) ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతోంది.

ఈ ఇంజిన్‌ తేజస్‌ విమానానికి అత్యంత కీలకమైన భాగం. ఒప్పందం ప్రకారం అందాల్సిన ఇంజిన్లు సమయానికి చేరకపోవడంతో విమానాల తయారీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది.

ఈ సమస్యను అధిగమించేందుకు హెచ్‌ఏఎల్‌ ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించింది.

ముందుగా విమానాల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఇంజిన్లు వచ్చిన తర్వాత వాటిని అమర్చాలని నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా ఇంజిన్ల సరఫరాలోనే ప్రధాన సమస్య!

ఇందుకోసం విమానాల ఫ్రేమ్‌లను సిద్ధం చేసి ఉంచింది. అయితే ఇంజిన్లతో పాటు ఇతర కీలకమైన విదేశీ విడిభాగాల సరఫరాలోనూ అంతరాయాలు ఏర్పడటంతో ఈ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

దీంతో విమానాల తయారీ పూర్తయినా, వాటిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి వైమానిక దళానికి అప్పగించడం కష్టంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

హెచ్‌ఏఎల్‌ పనితీరుపైనా ప్రభుత్వ సమీక్ష

విదేశీ విడిభాగాల సరఫరా సమస్యలతో పాటు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల్లోనూ కొన్ని లోపాలు ఉన్నాయని ఓ సీనియర్‌ రక్షణ అధికారి అంగీకరించినట్లు సమాచారం.

ముఖ్యంగా హెచ్‌ఏఎల్‌ తన ఉత్పత్తి వ్యవస్థలు, అసెంబ్లీ లైన్లను ఎంత సమర్థంగా నిర్వహిస్తోందన్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

తయారీ ప్రక్రియలో అంతర్గతంగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది.

ఈ నేపథ్యంలో రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

హెచ్‌ఏఎల్‌ పనితీరుపైనా ప్రభుత్వ సమీక్ష

ఏదైనా రక్షణ పరికరం లేదా యుద్ధ విమానం తయారీకి సంబంధించిన ఆర్డర్‌ వచ్చిన మూడు నెలల్లోగా పూర్తిస్థాయిలో సరఫరా వ్యవస్థను సమీక్షించాలని సూచించింది.

విడిభాగాల సరఫరాలో ఎక్కడైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? ఒకే సంస్థపై ఆధారపడటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయా? అనే అంశాలను పరిశీలించనున్నారు.

అవసరమైతే ప్రత్యామ్నాయ సరఫరాదారులను కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు.

తద్వారా ఒక్క విడిభాగం అందకపోవడంతో మొత్తం ప్రాజెక్టు నిలిచిపోయే పరిస్థితిని నివారించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

వివరాలు 

డెడ్‌లైన్లకు ప్రాధాన్యం.. 10 మార్కులతో పనితీరు అంచనా

రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడాన్ని ఉద్యోగుల,సంస్థల పనితీరు అంచనాలతో అనుసంధానిస్తోంది.

ఈ ఏడాది నుంచి రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల పనితీరు మూల్యాంకనంలో సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 10 మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నారు.

దీని ద్వారా సంస్థల్లో బాధ్యత పెంచడంతో పాటు, పనుల్లో జాప్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు 

డెడ్‌లైన్లకు ప్రాధాన్యం.. 10 మార్కులతో పనితీరు అంచనా

తేజస్‌ మార్క్‌-1ఏ విమానాల సరఫరాలో జాప్యం భారత్‌ రక్షణ తయారీ రంగంలోని కీలక సమస్యలను బయటపెడుతోంది.

అత్యాధునిక యుద్ధ విమానాలను స్వదేశంలోనే అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని భారత్‌ ఇప్పటికే నిరూపించుకుంది.

అయితే వాటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసి, నిర్ణీత సమయంలో వైమానిక దళానికి అందించేందుకు అవసరమైన విడిభాగాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT