
Supreme Court: 'ఫతేపూర్ సిక్రీ ఎందుకు కాదు?': పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీకి చెందిన చారిత్రాత్మక కట్టడమైన ఎర్రకోటపై హక్కు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తిగా గుర్తింపు పొందిన బహదూర్ షా జాఫర్ వారసురాలినని చెబుతున్న సుల్తానా బేగం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఎర్రకోటను తమకు అప్పగించాలనే కోరికతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సుల్తానా బేగం పిటిషన్‌ను తిరస్కరించింది.
ఈ దావా పూర్తిగా దారి తప్పేలా ఉందని వ్యాఖ్యానించిన ధర్మాసనం, ఆమె పెట్టిన అభ్యర్థనలో న్యాయపరమైన బలం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
ఎర్రకోటకే ఎందుకు పరిమితమవుతున్నారు?
పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, "మీరు నిజంగా మొఘల్ చక్రవర్తి వారసురాలైతే, ఎర్రకోటకే ఎందుకు పరిమితమవుతున్నారు? ఫతేపూర్ సిక్రీ వంటి ఇతర చారిత్రాత్మక స్మారకాలు వాటిని ఎందుకు వదిలివేయాలి? " అని ప్రశ్నించింది.
కేవలం ఎర్రకోటకే హక్కు కావాలనడం ఏకపక్షంగా, అభిప్రాయాలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఇంతకముందు, ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను 2023 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అప్పటి తీర్పుతో అసంతృప్తిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుల్తానా బేగం.
అంతకుముందు 2021లో తొలిసారిగా సుల్తానా బేగం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆమె తనను రెండవ బహదూర్ షా జాఫర్ మునిమనవడు భార్యనిగా పేర్కొన్నారు.
వివరాలు
డిసెంబర్ 2021లో,హైకోర్టుసింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌ను తిరస్కరించింది
1857లో జరిగిన తొలిస్వాతంత్ర్య సమర సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆస్తులను ఆక్రమించిందని ఆమె ఆరోపించారు.
ఆ సమయంలో బహదూర్ షా జాఫర్‌ను దేశం నుంచి బహిష్కరించడంతో పాటు మొఘల్స్‌కు చెందిన ఆస్తులన్నింటినీ అప్పటి బ్రిటిష్ సర్కార్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నదని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఆఆస్తులు భారత ప్రభుత్వ పరిపాలనలో ఉన్నాయని,వాటిని తమ కుటుంబానికి అప్పగించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు.
అయితే డిసెంబర్ 2021లో,హైకోర్టుసింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది.
అప్పట్లో న్యాయమూర్తి,"ఈఆస్తులు గత కొన్నేళ్లుగా ఇతరుల అధీనంలో ఉన్నాయని తెలిసి కూడా ఇంతవరకు పిటిషన్ ఎందుకు వేయలేదు? ఎందుకు ఆలస్యమైంది?" అని ప్రశ్నించారు.
కేసు దాఖలులో చాలా ఆలస్యం జరిగిందని కోర్టు స్పష్టంగా పేర్కొంది.