
Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ ప్రముఖులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ విమర్శించారు.
ప్రధాని మోదీ భారత పర్యాటకంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తే మాల్దీవులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
మోదీ జనవరి 3న లక్షద్వీప్‌లో పర్యటించారు. ఇక్కడ కాసేపు గడిపిన ఆయన ఈ ద్వీపంలో గడిపిన సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
భారతీయులకు ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రమని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈక్రమంలో నెటిజన్లు సోషల్ మీడియాలో లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చడం ప్రారంభించారు.
నెటిజన్లు స్పందిస్తున్న తీరుపై మాల్దీవుల మంత్రి మరియం షియునా, ఎంపీ జాహిద్ రమీజ్‌తో పాటు ఇతర మంత్రులు అక్కసును వెల్లగక్కారు. మోదీపై అసభ్యకరంగా ట్వీట్లు చేశారు.
మోదీ
రాబోయే కాలంలో పర్యాటకానికి కొత్త గమ్యస్థానంగా లక్షద్వీప్: ఎంపీ మహ్మద్ ఫైజల్
మాల్దీవుల రాజకీయాల నాయకుల వ్యాఖ్యలపై లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ ధ్వజమెత్తారు.
లక్షద్వీప్ పర్యాటకం, ఇతర రంగాల గురించి ప్రధాని మోదీ చెబితే మాల్దీవులు ఎందుకు స్పందిస్తున్నట్లు అని మహ్మద్ ఫైజల్ ప్రశ్నించారు.
రాబోయే కాలంలో లక్షద్వీప్ కొత్త గమ్యస్థానంగా మారబోతోందనేది సుస్పష్టమని వెల్లండిచారు. ఇది ఇంకా అన్వేషించబడలేదన్నారు.
ప్రధాని మోదీ లక్షద్వీప్‌కు వచ్చి ఒకరోజు ఇక్కడే ఉండటాన్ని.. పర్యాటక కోణంలో లక్షద్వీప్ ప్రజలు ఎప్పుడూ కోరుకునే విషయంగా ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ప్రభుత్వం టూరిజం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ఎందుకంటే ఇది యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఇందులో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.