
Hyderabad : ఇక వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు.. ఉచితంగానే ఆరోగ్య పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నిర్ధారణ కోసం పెద్ద డయాగ్నొస్టిక్ కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఇక లేదు. ప్రభుత్వ ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు (UPHCలు), బస్తీ దవాఖానాల్లోనే పలు రకాల వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఈ కేంద్రాల్లో దాదాపు 40కుపైగా రకాల డయాగ్నొస్టిక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రోగుల నుంచి శాంపిళ్లు సేకరించి, వాటిని నారాయణగూడ ప్రభుత్వ డయాగ్నొస్టిక్ ల్యాబ్‌కి పంపుతారు. అక్కడ పరీక్షలు పూర్తయ్యాక, రిపోర్టులు నేరుగా రోగుల ఫోన్ నంబర్‌కి పంపిస్తారు.
వివరాలు
కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని ఆరోగ్య కేంద్రాలు
కొన్ని ఫలితాలు 16 నుంచి 24 గంటల్లో అందుతాయి. అయితే యూరిన్ వంటి కల్చర్ రిపోర్టులు రావడానికి రెండు రోజులు పట్టవచ్చు. ఇక్కడ చికిత్స కోసం వచ్చే వారికి వైద్యుల కన్సల్టేషన్ సేవలు, అవసరమైన మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. ఇన్‌పేషంట్‌గా చేరిన వారికి సలైన్ ఇవ్వడం, రోజూ వైద్యులు వచ్చి పర్యవేక్షించడం వంటి సేవలు కూడా ఖర్చు లేకుండానే అందిస్తారు. ఈ విధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు ఆరోగ్య కేంద్రాలు ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా సేవలందిస్తున్నాయి.
వివరాలు
ఈ పరీక్షలు చేస్తారు
అధిక రక్తపోటు, మధుమేహం (హెచ్‌బీఏ1సీ), కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), రియాక్టివ్ ప్రొటీన్ (పీఆర్‌పీ), లివర్ ఫంక్షన్ టెస్టు (ఎల్‌ఎఫ్‌టీ), రీనల్ ఫంక్షన్ టెస్టు (ఆర్‌ఎఫ్‌టీ), లిఫిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్ తదితర), కంప్లీట్ యూరిన్ కల్చర్ పరీక్షలు, డెంగీ, మలేరియా, చికెన్‌గన్యా, థైరాయిడ్ ప్రొఫైల్, టైఫాయిడ్