
Pahalgam terror attack: పహల్గామ్‌లో హత్యకు గురైన నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్; ఎన్‌సిడబ్ల్యు జోక్యం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్‌ను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.ఆమె సైద్ధాంతిక అభిప్రాయాన్ని తప్పుగా భావించి ట్రోల్ చేయడం అనైతికమని, అలా చేయడం సమంజసం కాదని పేర్కొంది.
ఏప్రిల్ 22న పహల్గాములో జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఆయన భార్య హిమాన్షి,దేశంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కానీ, కొంతమంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలను దురుద్దేశపూర్వకంగా తీసుకున్నారు. ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ,కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశాయి.
వివరాలు
ఉగ్రదాడిపై దేశం మొత్తం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది
ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ, ''పహల్గాములో జరిగిన ఉగ్రదాడిలో అనేక కుటుంబాలు తీవ్ర దుఃఖానికి లోనయ్యాయి. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను మతం పేరుతో హత్య చేశారు. ఈ ఉగ్రదాడిపై దేశం మొత్తం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఆయన భార్య హిమాన్షి వ్యక్తం చేసిన అభిప్రాయంపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు కరెక్ట్ కాదు. ఆమె వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తప్పు. ఎలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు మర్యాదపూర్వకంగా, రాజ్యాంగ స్థితికి అనుగుణంగా ఉండాలి. జాతీయ మహిళా కమిషన్ ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడే చర్యలు తీసుకుంటుంది'' అని తెలిపారు.
వివరాలు
హనీమూన్‌కి జమ్మూ-కశ్మీర్‌కు..
హరియాణాకు చెందిన వినయ్ ,హిమాన్షి 2025 ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత 19న విందు నిర్వహించి, హనీమూన్‌కి జమ్మూ-కశ్మీర్‌కు వెళ్లారు. యూరప్ వెళ్లాలని వారు ఆలోచించారు కానీ వీసాలు రిజెక్ట్ కావడంతో జమ్మూ-కశ్మీర్‌కు వెళ్లారు.
ఈ సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. పెళ్లై వారం కూడా గడవక ముందే.. , ఆమె జీవచ్ఛవంలా మారిన భర్తను చూసి హతాశురాలైంది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోదించిన తీరు ప్రతిఒక్కరిని బాధించింది.