
TVK Vijay: అల్లు అర్జున్ కేసు తరహాలో.. విజయ్‌ని కూడా అరెస్టు చేస్తారా?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు దళపతి విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆయన ప్రసంగం కొనసాగుతుండగా తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలు కాగా, అనేక మంది స్పృహ తప్పి కుప్పకూలారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పరిస్థితి చేదుగా మారినట్లు గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు.
Details
సభకు లక్షకు మందికిపైగా అనుమతి
అత్యవసరంగా అంబులెన్సుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం కరూర్‌లో వాతావరణం విషాదంతో నిండిపోయింది. ఈ సభకు 10 వేల మందికి అనుమతి ఇచ్చినా, దాదాపు లక్ష మందికి పైగా తరలివచ్చినట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ జనసంద్రం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తూ 'అయ్యోరామా' అని బాధ పడుతున్నారు.
Details
సోషల్ మీడియాలో విజయ్ పై విమర్శలు
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో విజయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, కార్యకర్తల మృతికి కారణం విజయ్‌నేనని కొందరు ఆరోపిస్తూ, ఆయనపై కేసు నమోదు చేయాలని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆర్సీబీ జట్టుపై కూడా కేసు పెట్టబడింది. ఇదే తరహాలో విజయ్‌పైనా కేసు నమోదు అవుతుందా, ఆయన అరెస్ట్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది.