తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Purandeswari: దిల్లీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలు: పురందేశ్వరి
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Feb 09, 2025 
                    
                     12:49 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడుతోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, 27 ఏళ్ల తర్వాత దిల్లీలో మళ్లీ అధికారంలోకి వచ్చామని, ఈ విజయానికి పార్టీ కార్యకర్తల కృషి ప్రధాన కారణమని ఆమె కొనియాడారు.
Details
గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదు
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పురందేశ్వరి స్పందించారు. గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆ సమయంలో అభివృద్ధి అనే పదానికి తావే లేకుండా పోయిందన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకోవడంపైనే దృష్టి సారించారంటూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు.