Loading...
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి యత్నించిన మహిళ.. పోలీసులకు అప్పగించిన టీఎంసీ కార్యకర్తలు
పోలీసులకు అప్పగించిన టీఎంసీ కార్యకర్తలు

Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి యత్నించిన మహిళ.. పోలీసులకు అప్పగించిన టీఎంసీ కార్యకర్తలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
09:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీపై ఓ గుర్తుతెలియని మహిళ దాడికి ప్రయత్నించిందని టీఎంసీ నేతలు ఆరోపించారు. కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న మమత నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. దుర్గా పూజ మంటపాన్ని ప్రారంభించేందుకు మమత తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ పరిణామం జరిగినట్లు వెల్లడించారు. టీఎంసీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. మమత బయటకు వచ్చిన సమయంలో ఓ మహిళ ఒక్కసారిగా ఆమె వద్దకు దూసుకొచ్చింది. మమతా బెనర్జీ చీరను లాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న టీఎంసీ కార్యకర్తలు, నేతలు వెంటనే అప్రమత్తమై ఆ మహిళను అడ్డుకున్నారు.

వివరాలు 

మాజీ ముఖ్యమంత్రి భద్రతపై సందేహాలు 

అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. దుస్తుల్లో దాచిపెట్టిన కత్తి బయటపడినట్లు వారు పేర్కొన్నారు.

ఆ మహిళను పట్టుకున్న అనంతరం కాళీఘాట్ పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన నేపథ్యంలో మమతా బెనర్జీకి కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లపై టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా పరిణామం మాజీ ముఖ్యమంత్రి భద్రతపై పలు సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

మమతకు తక్షణమే భద్రతను పెంచాలని సంబంధిత అధికారులను టీఎంసీ నేతలు కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మమతా బెనర్జీపై దాడికి యత్నం.. మహిళ దుస్తుల్లో కత్తి లభ్యం

ADVERTISEMENT