LOADING...
Vijayawada: విజయవాడలో దారుణం.. భార్యను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త
విజయవాడలో దారుణం.. భార్యను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త

Vijayawada: విజయవాడలో దారుణం.. భార్యను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్తే నడిరోడ్డుపై దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. మృతురాలు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ విభేదాల కారణంగా భర్త, భార్య గత కొంతకాలంగా విడిగా జీవిస్తున్నారు. ఈ కలహాలపై ఆగ్రహం పెంచుకున్న భర్త, చివరికి ఆవేశానికి లోనై నడిరోడ్డుపై సరస్వతిని హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 విజయవాడలో నడిరోడ్డుపై దారుణ హత్య