LOADING...
Faridabad: ఫరీదాబాద్‌లో దారుణ ఘటన.. కదులుతున్న వ్యాన్‌లో యువతిపై సామూహిక అత్యాచారం 
కదులుతున్న వ్యాన్‌లో యువతిపై సామూహిక అత్యాచారం

Faridabad: ఫరీదాబాద్‌లో దారుణ ఘటన.. కదులుతున్న వ్యాన్‌లో యువతిపై సామూహిక అత్యాచారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని ఫరీదాబాద్‌లో సభ్యసమాజం తీవ్రస్థాయిలో కలవని దారుణ ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల ఒక యువతిని కదులుతున్న వ్యాన్‌లో గురిచేసి, దుండగులు సామూహిక అత్యాచారానికి గురి చేశారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బాధితురాలు సోమవారం రాత్రి ఇంటికి వెళ్ళేందుకు వాహనానికి ఎదురుచూస్తుండగా, ఒక వ్యాన్ ఆమె దగ్గర ఆగింది. "ఇంటికి చేర్చుతాం" అని చెప్పి, ఇద్దరు యువకులు ఆమెను వాహనంలోకి ఎక్కించారు. తర్వాత వ్యాన్‌ను గుర్గావ్ రోడ్ వైపు మళ్లించి, సుమారు రెండు గంటల క్రమంలో ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. బాధితురాలు ఎంత వేడుకున్నా వినిపించుకోకుండా బెదిరింపులకు దిగారు.

వివరాలు 

బాధితురాలి ముఖానికి తీవ్ర గాయాలు.. 12 కుట్లు వేసిన వైద్యులు 

మంగళవారం తెల్లవారుజామున, సుమారు 3 గంటలకు, ఎస్‌జీఎమ్ నగర్‌లోని రాజా చౌక్ సమీపంలో ఆమెను వ్యాన్ నుంచి బయటకు తోసేశారు. ఈ దాడి కారణంగా ఆమె ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి.రక్తంతో ఉన్న బాధితురాలు తన సోదరుడికి ఘటన వివరించగా, కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ముఖానికి అయిన గాయాలకు వైద్యులు 10 నుంచి 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, తీవ్ర షాక్‌లో ఉంది. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు ప్రస్తుతం భర్తతో వేరుగా ఉంటోంది. ఘటనకు ముందే,తల్లితో గొడవపడి,స్నేహితురాలి ఇంటికి వెళుతున్నట్లు సోదరికి సమాచారం ఇచ్చింది.

వివరాలు 

ఇద్దరు నిందితుల అరెస్ట్

ఘటనా విషయంపై బాధితురాలి సోదరి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు కోలుకున్న తర్వాత, ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement