Parliament Session: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కీలక బిల్లులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కీలకమైన ఘట్టానికి నాంది పలికేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది. మహిళలకు రిజర్వేషన్లకు తుది రూపం ఇవ్వడం, నియోజకవర్గాల సంఖ్యను పెంచడం, వాటిని పునర్విభజించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మూడు ముఖ్యమైన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లులను సభ ముందు ఉంచారు. అనంతరం వాటిపై చర్చ ప్రారంభమైంది. ఈ ప్రతిపాదనల్లో లోక్‌సభ స్థానాలను ఐదు వందల యాభై నుంచి గరిష్ఠంగా ఎనిమిది వందల యాభై వరకు పెంచే అంశం ప్రధానంగా ఉంది.
వివరాలు
బిల్లుపై రెండు సభల్లో కలిపి పదెనిమిది గంటలపాటు చర్చ
2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఇందులో భాగంగా ఉంది. అదేవిధంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసే బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా పునర్విభజనకు అవకాశం కల్పించే మరో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై సమగ్రంగా చర్చించేందుకు పార్లమెంట్ మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ప్రతి బిల్లుపై రెండు సభల్లో కలిపి పదెనిమిది గంటలపాటు సభ్యులు చర్చించనున్నారు. ఈ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం లోక్‌సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు.