లోక్‌సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు
లోక్‌సభ,రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% సీట్లు మంజూరు చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 454 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా, 2 ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న ప్రవేశపెట్టారు. ఈ రోజు (బుధవారం) దీనిపై చర్చ లోకసభ లో జరిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చ అనంతరం.. న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే 'ఎస్' అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై 'నో' అని రాయాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ సభ్యులకి వివరించారు.