
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం: ఒవైసీ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఎక్కువ మంది మహిళలు పార్లమెంటుకు ఎన్నికవుతారు అని మహిళా రిజర్వేషన్ బిల్లు చెబుతోంది అన్నారు.
అదే నిజమైతే ఎక్కువ జనాభా ఉండి, అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, ముస్లిం మహిళలకు ఎందుకు కోటాను వర్తింపజేయడం లేదని ఒవైసీ ప్రశ్నించారు.
అగ్రవర్ణాల మహిళల కోసమే నరేంద్ర మోదీ ఈ బిల్లును తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోందని ఆయన అన్నారు.
దేశంలో ముస్లిం మహిళల జనాభా 7 శాతం ఉన్నా కూడా, లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం 0.7 శాతమే ఉందన్నారు. ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా కావాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా కోసం ఒవైసీ డిమాండ్
#AIMIM MP Asaduddin Owaisi Opposes Women's Reservation Bill, Says 'It Deceives #Muslim Community'#AsaduddinOwaisi #Hyderabad #WomenReservationBill #PMModi #NarendraModi #India pic.twitter.com/QjgwrfieTV
— Indian News Network (@INNChannelNews) September 20, 2023