Uttarkashi tunnel: ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్‌గావ్ కూలిపోవడంతో కూలిపోయిన అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కార్మికులను రక్షించేందుకు నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియల ధాటికి 'ఎస్కేప్ టన్నెల్'ను నిర్మించేందుకు ఏర్పాటు చేసిన డ్రిల్లింగ్ మిషన్ ప్లాట్‌ఫారమ్ దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు రెస్క్యూ వర్కర్లు గాయపడ్డారు. అయితే అగిపోయిన రెస్క్యూ పనులను కొనసాగించాలని తోటి కార్మికులు నిరసనకు దిగారు. తమ తోటి కార్మికులను రక్షించాలని డిమాండ్ చేసారు.
కార్మికులను బయటకు తీసుకొస్తాం: డీజీపీ
కార్మికుల ఆందోళనపై ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ స్పందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌తో చర్చలు జరిగాయని, త్వరలో దిల్లీ నుంచి భారీ యంత్రాలను సంఘటనా స్థలానికి పంపిస్తామన్నారు. తద్వారా కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకొస్తామని వివరించారు. రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ రుహేలా మాట్లాడుతూ.. భూమిని తవ్వే ఆగర్ యంత్రం 900 మిమీ వ్యాసం కలిగిన పైపులను ఉదయం సంఘటనా స్థలానికి తీసుకొచ్చనట్లు, సొరంగంలో 'డ్రిల్లింగ్'ను ప్రారంభించామని వివరించారు. అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే, బుధవారం సాయంత్ర నాటికి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తామని వెల్లడించారు.