
Amaravati: అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ క్రమంలో బ్యాంక్ పాలకవర్గం రూ.6,750 కోట్ల రుణం మంజూరు చేసింది. అదేవిధంగా, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇప్పటికే రూ.6,850 కోట్ల రుణం మంజూరు చేసిందని తెలిసిందే.
రెండు బ్యాంకుల కలిపి మొత్తం రూ.15 వేల కోట్ల రుణం విడతల వారీగా అందించేందుకు అంగీకారం తెలిపాయి.
హడ్కో (HUDCO) మరియు జర్మన్ బ్యాంక్ కలిసి మరో రూ.16 వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
వివరాలు
హడ్కో ద్వారా త్వరలో టెండర్లు
హడ్కో ద్వారా పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలిచే అవకాశముంది.
సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభం కావొచ్చని సమాచారం.ఇకపోతే, సీఎం చంద్రబాబు ఇటీవల రాజధాని నిర్మాణంపై అధికారులకు రోడ్ మ్యాప్ అందించినట్లు వెల్లడించారు.
గత మూడు నెలలలో ఏర్పడిన సంక్షోభాలను సమర్థంగా నిర్వహించామని, రాజధాని పునర్నిర్మాణంపై ఐఐటీ చెన్నై, హైదరాబాద్ నిపుణులతో అధ్యయనం చేయించి రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు చెప్పారు.
కొత్త పనులను వెంటనే ప్రారంభించడానికి పూర్తి కార్యాచరణ సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.