Shamshabad: శంషాబాద్‌లో దిగిన ప్రపంచంలో అతి పెద్ద సరకు రవాణా విమానం
ప్రపంచ దేశాల్లో ఆకాశ తిమింగలంగా 'బెలుగా' విమానానికి ప్రత్యేక స్థానముంది. గురువారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బెలుగా ప్రత్యక్షమైంది. ప్రపంచంలో అతి పెద్ద సరకు రవాణా విమానం ల్యాండ్ కావడం గమనార్హం. ఈ ఎయిర్‌బస్ విమానం మస్కట్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లేందుకు ప్రయాణం ప్రారంభించింది. మార్గ మధ్యలో ఇంధనం నింపుకోవడం, అలాగే క్రూ సిబ్బంది విశ్రాంతి కోసం పైలట్ ఈ విమానాన్ని శంషాబాద్‌లో నిలిపినట్లు సమాచారం అందింది. 15 గంటల విశ్రాంతి అనంతరం, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బెలుగా తన యథాస్థానానికి తిరిగి బయలుదేరింది.
బెలుగా విమానం ప్రత్యేకతలను తెలుసుకోండి
2022 డిసెంబరు, 2023 ఆగస్టులోనూ ఈ భారీ లోహ విహంగం శంషాబాద్ విమానాశ్రయంలో దిగిందని ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. బెలుగా విమానం ప్రత్యేకతలు పొడవు: 56.16 మీటర్లు ఎత్తు: 17.25 మీటర్లు రెక్కలు: 44.84 మీటర్లు లోడబుల్ క్రాస్-సెక్షన్ ఎత్తు: 7.1 మీటర్లు లోడబుల్ క్రాస్-సెక్షన్ వెడల్పు: 7.1 మీటర్లు సరకు రవాణా సామర్థ్యం: 40 టన్నులు టేకాఫ్ బరువు: 155 టన్నులు ల్యాండింగ్ బరువు: 140 టన్నులు ఇంధనం లేకుండా బరువు: 133.8 టన్నులు ఇంధన ట్యాంకు సామర్థ్యం: 23,860 లీటర్లు ఆగకుండా ప్రయాణించే సామర్థ్యం: 1,650 కి.మీ