LOADING...
IRCTC: 'వందేభారత్‌' భోజనంలో పురుగులు.. IRCTCకి భారీ జరిమానా
'వందేభారత్‌' భోజనంలో పురుగులు.. IRCTCకి భారీ జరిమానా

IRCTC: 'వందేభారత్‌' భోజనంలో పురుగులు.. IRCTCకి భారీ జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించిన భోజనంలో పురుగులు కనిపించిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. ప్రయాణికుడు రితేష్ కుమార్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మార్చి 15న పట్నా నుంచి టాటానగర్ వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో రితేష్ కుమార్ ప్రయాణం చేశారు. ప్రయాణ సమయంలో ఆయనకు అందించిన భోజనంలో ఉన్న పెరుగు తెరిచి చూడగా అందులో పురుగులు కనిపించాయి. ఈ ఘటనతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే రైలు మేనేజర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఆహారాన్ని పరిశీలించారు.Embed

వివరాలు 

ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా

ఇదే సమయంలో జరిగిన విషయాన్ని రితేష్ కుమార్ వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఈ విషయం తీవ్రంగా చర్చకు వచ్చింది. ఈ ఘటనపై రైల్వే మంత్రిత్వశాఖ కూడా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చిన అధికారులు, ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. అలాగే ఆ రైలులో కేటరింగ్ సేవలు అందించిన ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ, రూ.50లక్షల జరిమానాతో పాటు అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత,వారికి అందించే సేవల్లో నాణ్యత తమకు అత్యంత ముఖ్యమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రితేష్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్  

Advertisement