Page Loader
అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్
క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం

అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్

వ్రాసిన వారు Stalin
Jan 20, 2023
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు పలువురు కోచ్‌ల వేధింపులు తాళలేక ఆందోళనకు దిగిన రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ సమావేశమయ్యారు. దిల్లీలోని అనురాగ్ ఠాకూర్‌ ఇంట్లో 4గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక ప్రతిపాదనలను రెజ్లర్లు కేంద్ర మంత్రి ముందు ఉంచారు. అందులో ప్రధానంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు పలువురు కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా వంటి స్టార్ రెజ్లర్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ)కి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు.

అనురాగ్ ఠాకూర్

డబ్ల్యుఎఫ్‌ఐ రద్దు ప్రతిపాదనపై శుక్రవారం రెజ్లర్లతో అనురాగ్ చర్చలు

రెజ్లింగ్ నిరసన అంశం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న అనురాగ్ ఠాకూర్‌ హుటాహుటిన దిల్లీకి చేరుకున్నారు. తన నివాసంలోనే సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో పాటు మిగతా రెజ్లర్లతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. అయితే 24గంటల్లో రాజీనామా చేయాలని శరణ్ సింగ్‌కు కేంద్రం ఆదేశాలిచ్చినట్లు సమాచారం. డబ్ల్యుఎఫ్‌ఐ మొత్తాన్ని రద్దు చేయాలని రెజ్లర్లు ప్రతిపాదించగా, దానిపై శుక్రవారం జర్చించనున్నారు. అంతకు ముందు కూడా లైంగిక వేధింపుల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని శరణ్ సింగ్‌ను కేంద్రం ఆదేశించింది.