
క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఎదుట రెజ్లర్లు 5 డిమాండ్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఒక మహిళ నేతృత్వం వహించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చిఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రెజర్లు బుధవారం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌ను కలిశారు.
రెజ్లర్లను మరోసారి చర్చలకు రావాలని ఠాకూర్ ఆహ్వానించడంతో బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా ఐదు డిమాండ్లను క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎదుట రెజ్లర్లు ఉంచారు. ఐదు రోజుల్లో రెజ్లర్లు, ప్రభుత్వం మధ్య ఇది రెండో సమావేశం కావడం గమనార్హం.
రెజ్లర్లు శనివారం హోం మంత్రి అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే.
రెజ్లర్లు
ఐదు డిమాండ్లు ఇవే
1. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చిఫ్ బాధ్యతలను మహిళకు అప్పగించాలి.
2. బ్రిజ్ భూషణ్ సింగ్, అతని కుటుంబం నుంచి ఎవరూ రెజ్లింగ్ సమాఖ్యలో భాగం కావొద్దు.
3. అవినీతి, దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ సంస్థకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా" ఎన్నికలు నిర్వహించాలి.
4. ఏప్రిల్ 28న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.
5. లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలి.
ముందుగా షెడ్యూల్ చేసిన ఓ కార్యక్రమం ఉండటంతో ప్రముఖ రెజ్లర్ల వినేష్ ఫోగట్ సమావేశానికి హాజరు కాలేదు.