
Yanam: గోదావరి జిల్లాల్లో అరుదైన చీరమేను చేప.. మార్కెట్లో అధిక డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి జిల్లాల్లో అమితంగా ఇష్టపడే అరుదైన చేప "చీరమేను" కోసం కోనసీమ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ చేప పేరు వింటేనే చాలామందికి నోరూరిపోతుంది.మసాలాలు కలిపి వేపితేనో,చింతకాయ తొక్కుతో కూర వండి వేడివేడిగా గారెలతో తింటేనో-ఆ రుచిని స్వర్గానుభూతిగా వర్ణిస్తారు. సాధారణంగా పెద్దదారంలా సన్నగా ఉండే ఈ చీరమేను చేపను మత్స్యకారులు లీటర్ల కొలతల్లో అమ్ముతారు. దశమి,ఏకాదశి రోజుల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.
వివరాలు
10 లీటర్ల బకెట్.. రూ.14 వేలు
గురువారం యానాం రేవు వద్ద జరిగిన వేలంలో 10 లీటర్ల బకెట్ చీరమేను రూ.14 వేల వరకు అమ్ముడైంది. ఒక్క రోజులోనే రూ.10 లక్షలకు పైగా వ్యాపారం జరిగినట్లు సమాచారం. చీరమేను చేపకు శాస్త్రీయ నామం శారిడా గ్రేసిలిస్ (Sarrida gracilis) అని, ఇవి సముద్రం,నది కలిసే ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయని కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ కళాశాల జువాలజీ విభాగ అధ్యాపకుడు బొల్లోజు బాబా వివరించారు.