Year Ender 2024: NEET UG నుండి SSC MTS వరకు, ఈ సంవత్సరం పరీక్ష పేపర్ లీక్ కేసుల జాబితా
2024లో దేశంలో అనేక రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించబడటంతో పాటు వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ నేపథ్యంలో పలు పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు వివరాలు బయటపడ్డాయి. దీనితో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షలపై అనేక అనుమానాలు తలెత్తాయి. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2024 ఫిబ్రవరిలో జరిగింది.దాదాపు 45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే,పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటలు ముందు పేపర్ లీక్ అయింది.ఈ పేపర్ లీక్ వ్యవహారం తరువాత,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ పరీక్షను రద్దు చేశారు. ఈ పేపర్‌లు రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు విక్రయించబడ్డాయి. ఈ కేసులో 244 మందిని అరెస్టు చేశారు.
యూపీపీఎస్‌సీ ఆర్‌ఓ, ఏఆర్‌ఓ పేపర్ లీక్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)లో 444 సెక్షన్ ఆఫీసర్ (ఎస్‌ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ) పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలో పేపర్ లీక్ జరిగింది. ఇందులో పలు కోచింగ్ సెంటర్లు, సాల్వర్ ముఠాలు పోలీసులకు చిక్కాయి. వారు ఎనీడెస్క్ యాప్ ద్వారా కాపీ రాయించేందుకు సహకరించారని గుర్తించారు. 2024 ఫిబ్రవరి 11న ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్‌సీ) ఆర్‌ఓ, ఏఆర్‌ఓ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. అయితే, పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్షను రద్దు చేశారు. ప్రశ్నాపత్రాలు హర్యానా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లీక్ అయినట్లు తేలింది.
నీట్ యూజీ పేపర్ లీక్
నీట్ యూజీ పేపర్ లీక్ కూడా పెద్ద దుమారం రేపింది. 2024 మే 5న నిర్వహించిన ఈ మెడికల్ ప్రవేశ పరీక్షలో 1,563 మంది అభ్యర్థులు లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది, అలాగే యూజీసీ నెట్ 2024 జూన్ 18న నిర్వహించిన పరీక్ష కూడా పేపర్ లీక్ కారణంగా రద్దు చేయబడింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సీ) 2024 సెప్టెంబర్ 21, 22న నిర్వహించిన సీజీఎల్ పరీక్షలో పేపర్ లీక్ జరిగినట్లు బయటపడింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ లో జరిగిన ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్ష కూడా పేపర్ లీక్ వ్యవహారం కారణంగా పరిశీలనలో ఉంది.
2024 జూన్ నుంచి పేపర్ లీక్‌లను నిరోధించడానికి చట్టం
బీహార్‌లోని పట్నా డిజిటల్ పరీక్షా కేంద్రంలో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ పరీక్షలో చీటింగ్ జరిగింది. సీహెచ్‌ఓ పరీక్ష 2024లో కూడా పేపర్ లీక్‌కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ లీక్ కారణంగా 37 మంది నిందితులను అరెస్టు చేశారు. 2024లో, పేపర్ లీక్‌లను నియంత్రించేందుకు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం, పేపర్ లీక్ వంటి అక్రమాలకు పాల్పడేవారికి మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, అలాగే ₹10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. వ్యవస్థీకృత లీకేజీకి కోటి రూపాయల వరకూ జరిమానా విధించబడుతుంది.