Loading...
Aznar River: ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిన నదిని శుభ్రం చేసిన యువకుడు.. సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం!
ప్లాస్టిక్ చెత్తతో నిండిన నదికి కొత్త జీవం యువకుడు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

Aznar River: ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిన నదిని శుభ్రం చేసిన యువకుడు.. సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 04, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి సురేంద్ర సింగ్ చౌదరి తన ఒక్క నిర్ణయంతో పర్యావరణ హీరోగా నిలిచాడు. స్థానికులు పూర్తిగా వదిలేసిన 'అజ్నార్ నది'ని స్వయంగా శుభ్రం చేయడం ప్రారంభించి, ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిగా మారాడు. అతడి సేవలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ప్రశంసించారు.

వివరాలు

గణతంత్ర దినోత్సం రోజున మొదలైన ఉద్యమం

రాజ్‌గఢ్ జిల్లా బియోరాకు చెందిన బిట్టు బీఎస్సీ చదువుతున్నాడు. 2026 జనవరి 26న ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు వేచి చూడకుండా తానే నదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు.

నదిలోకి దిగి ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు, పూజా సామగ్రి, ఆల్గీతో పాటు పేరుకుపోయిన చెత్తను చేతులతోనే తొలగించడం ప్రారంభించాడు.

వీడియోలు వైరల్..

దేశవ్యాప్తంగా ప్రశంసలు నదిని శుభ్రం చేస్తున్న దృశ్యాలను బిట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

చెత్తతో పూర్తిగా కనిపించకుండా పోయిన అజ్నార్ నదిలోని అనేక ప్రాంతాలు ఇప్పుడు శుభ్రంగా మారాయి. అతడి అంకితభావానికి పర్యావరణ కార్యకర్తలు, నెటిజన్లు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వివరాలు

ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ఆ యువకుడు చేసిన సేవలను ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ, యువత ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలని అభినందించారు.

ఒక్క వ్యక్తి సంకల్పం సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో బిట్టు నిరూపించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ADVERTISEMENT