Hussain Sagar: హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్.. కుటుంబ సభ్యుల ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన 'భరతమాతకు మహా హారతి' కార్యక్రమంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.
తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన రెండు బోట్లలో బాణసంచా సామగ్రిని సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి టపాసులు పేల్చినప్పుడు, నిప్పు రవ్వలు తిరిగి బోట్లపై పడ్డాయి.
ఈ క్రమంలో బోట్లలో ఉన్న బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఫలితంగా రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు బోట్లలో మొత్తం ఏడుగురు ఉన్నారు.
Details
నలుగురికి గాయాలు
వారిలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఓ యువకుడు మిస్ అయినట్లు తెలుస్తోంది.
నాగరంకు చెందిన 21 సంవత్సరాల అజయ్, తన స్నేహితులతో కలిసి ఓ బోటులో ఉన్నాడు, కానీ అతను కనపడటం లేదు. అతనితో ఉన్న స్నేహితులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
కానీ అజయ్ ఏ ఆస్పత్రిలో కూడా కనిపించడంలేదని పేర్కొన్నారు.
దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు కలిసి అజయ్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.