Page Loader
Sunny Yadav: యూట్యూబ్ స్టార్ సన్నీ యాదవ్ అరెస్ట్..!
యూట్యూబ్ స్టార్ సన్నీ యాదవ్ అరెస్ట్..!

Sunny Yadav: యూట్యూబ్ స్టార్ సన్నీ యాదవ్ అరెస్ట్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ యూట్యూబర్, అంతర్జాతీయ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇటీవల బైక్‌పై పాకిస్తాన్ టూర్‌కు వెళ్లిన సన్నీ యాదవ్‌ తిరిగి భారత్‌కు చేరుతుండగా, చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన పాకిస్తాన్ టూర్‌కు సంబంధించిన వివరాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా పోలీసులు గతంలో లుక్‌ఔట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 5న నూతనకల్ పోలీసు స్టేషన్‌లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంశంపై ఆయనపై కేసు నమోదైంది.

Details

ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ

అనేక సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు విదేశాల్లో ఉన్నారన్న అనుమానంతో ఆయనపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో వాఘా బోర్డర్ గుండా పాకిస్తాన్‌లోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా పాకిస్తాన్ బైక్ టూర్ పూర్తి చేసుకున్నట్టు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సన్నీ యాదవ్, భారత్ తిరిగొచ్చిన వెంటనే అరెస్టయ్యారు. ప్రస్తుతం ఈ కేసును NIA విచారిస్తోంది. ఈ అరెస్టుతో పాటు, పాకిస్తాన్ టూర్ వెనక ఉన్న ఉద్దేశ్యాలపై, ఆ యాప్ ప్రమోషన్ల వెనక ఉన్న నెట్‌వర్క్‌పై అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.