YS Sharmila: శస్త్రచికిత్స తర్వాత త్వరితగతిన కోలుకుంటున్నా: వైఎస్ షర్మిల
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 26, 2026
03:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శస్త్రచికిత్స అనంతరం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా అభిమానులు, శ్రేయోభిలాషులతో పంచుకున్నారు. ఇటీవల వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు ఉదరానికి సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.
వివరాలు
త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష..
ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నానని షర్మిల తెలిపారు.
తన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం ఆరా తీస్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అందించిన ప్రేమాభిమానాలు, ప్రార్థనలు, అండదండలు ఈ క్లిష్ట సమయంలో తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని షర్మిల పేర్కొన్నారు.