Page Loader
YS Sharmila: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. హాజరుకాని వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్ 
YS Sharmila: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. హాజరుకాని వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్

YS Sharmila: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. హాజరుకాని వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్ 

వ్రాసిన వారు Stalin
Feb 18, 2024
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

YS Sharmila son marriage: వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి శనివారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమైద్ భవన్‌లో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే తన మేనల్లుడి పెళ్లికి షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. చాలా కాలంగా వీరిద్దరు ఎడమొహంగా పెడమొహంగా ఉంటున్న విషయం తెలిసిందే. జనవరి 17న రాజారెడ్డి-ప్రియా అట్లూరి నిశ్చితార్థ వేడుక జరగ్గా.. వైఎస్ జగన్ హాజరై తన మేనల్లుడిని ఆశీర్వదించారు. అయితే ఆ సమయంలో జగన్‌తో ఫొటో దిగేందుకు కూడా షర్మిల ఆసక్తి చూపకపోవడం గమనార్హం. విజయమ్మ బలవంతం చేయడంతో అతి కష్టంమీద షర్మిల జగన్‌తో ఫొటో దిగారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెళ్లి ఫొటోలను షేర్ చేసిన షర్మిల