NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. వైసీపీ కార్యకర్త ఘోర హత్య
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. వైసీపీ కార్యకర్త ఘోర హత్య
    ఏపీలో దారుణం.. వైసీపీ కార్యకర్త ఘోర హత్య

    ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. వైసీపీ కార్యకర్త ఘోర హత్య

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 24, 2023
    10:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ హత్యా రాజకీయాలు పురివిప్పికున్నాయి. ఈ మేరకు ఒక్కసారిగా పల్నాడు జిల్లా ఉలిక్కిపడింది.

    కూనిరెడ్డి కృష్టారెడ్డి అనే వైసీపీ (వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ) కార్యకర్తను ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గొడ్డళ్లతో అత్యంత దారుణంగా నరికారు.

    పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర అలజడులు రేగుతున్నాయి.

    మరోవైపు కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితులు దిగజారకుండా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు సిద్ధం చేశారు.

    అధికార పార్టీ కార్యకర్త, కృష్ణారెడ్డిని చంపిన వారిని పట్టుకునేందుకు 3 స్పెషల్ టీమ్ లను పోలీస్ శాఖ సిద్ధం చేసింది.

    details

    అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

    కూనిరెడ్డి కృష్ణారెడ్డి పులిపాడు ప్రభుత్వ వైన్ షాప్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముసుగులు ధరించి వచ్చిన ఐదుగురు దుండగులు, అతని కళ్లలో కారం చల్లారు. అనంతరం ఘోరంగా హత్య చేశారని స్థానికులు తెలిపారు.

    అయితే హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. కానీ రాజకీయాలే కారణమా లేక ఇతర వ్యాపార కారణాలు ఏమైనా ఉండొచ్చా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

    మరోవైపు ఇదే జిల్లాలోని గురజాల మండలం, జంగమహేశ్వరం గ్రామంలో గతంలోనూ ఫ్యాక్షన్ చరిత్ర ఉంది.

    ఈ సందర్భంగా హత్యకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ క్యాడర్ కారణం అంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    హత్య

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి చంద్రబాబు నాయుడు
    AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే  విశాఖపట్టణం
    చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా  చంద్రబాబు నాయుడు
    ఏపీ అసెంబ్లీలో రగడ.. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' తెలుగు సినిమా
    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా ఆంధ్రప్రదేశ్
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్

    హత్య

    బర్త్ డేకు ఇంటి పిలిచారని వెళ్తే, దొంగతనం పేరిట హింసించి చంపిన బంధువులు ఉత్తర్‌ప్రదేశ్
    జిమ్ నుంచి ఇంటికెళ్తున్న వైసీపీ కార్యకర్త.. బురఖా కప్పుకుని వచ్చి హత్య చేసిన ప్రత్యర్థులు వైఎస్సార్ కడప
    యూపీ: వివాహితను గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోమంటే ప్రాణం తీశాడు ఉత్తర్‌ప్రదేశ్
    గురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025