Karumuru Venkat Reddy: వైసీపీ నేత కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ పోలీసులు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవలి తిరుమల పరకామణి వ్యవహారానికి సంబంధించిన కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీశ్‌కుమార్ ఈ నెల 14న తాడిపత్రి పరిసరాల్లో రైల్వేట్రాక్ పక్కన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసుపై ఏపీ పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించారని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై కారుమూరు వెంకట్‌రెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
వివరాలు
తాడిపత్రి టిడిపి నాయకుడు ప్రసాదనాయుడు ఫిర్యాదు
కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన ప్రభుత్వంపై, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో తాడిపత్రి టిడిపి నాయకుడు ప్రసాదనాయుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా కూకట్‌పల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో ఆయన ఉన్నట్టు గుర్తించి, మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు.