LOADING...
YSRCP: నంద్యాలలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన పీవీ ప్రదీప్ రెడ్డి
నంద్యాలలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన పీవీ ప్రదీప్ రెడ్డి

YSRCP: నంద్యాలలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన పీవీ ప్రదీప్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ప్రదీప్ రెడ్డి పార్టీ మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ సమక్షంలో ప్రదీప్ రెడ్డి పసుపు కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గతంలో వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా విభాగాన్ని సమర్థవంతంగా నడిపించిన ప్రదీప్ రెడ్డి, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.

వివరాలు 

ఈ చేరికతో పార్టీ బలోపేతమైందని టీడీపీ వర్గాల ధీమా 

అలాంటి నాయకుడు టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలో చేరిన అనంతరం ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను టీడీపీ కాపాడుతుందని, ప్రజల సమస్యలపై ఆ పార్టీ సాగిస్తున్న పోరాటం తనను ఆకర్షించిందన్నారు. నంద్యాల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీడీపీ నాయకత్వంలో పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం అప్పగించే ఏ బాధ్యతనైనా నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ చేరికతో నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రదీప్ రెడ్డి టీడీపీలో చేరడం వల్ల వైసీపీలోని కొందరు అసంతృప్త నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Advertisement