Page Loader
YS Sharmila: 119 స్థానాల్లో YSRTP పోటీ.. పాలేరు నుంచి షర్మిల
119 స్థానాల్లో YSRTP పోటీ.. పాలేరు నుంచి షర్మిల

YS Sharmila: 119 స్థానాల్లో YSRTP పోటీ.. పాలేరు నుంచి షర్మిల

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2023
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరుతో పాటు మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు షర్మిల వెల్లడించారు. మరోవైపు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేస్తారని తెలుస్తోంది. పార్టీ భీపామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు. షర్మిల భర్త అనిల్ కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉంది.

Details

ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైన షర్మిల

ఇటీవల కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం అవుతుందంటూ పెద్ద ఎత్తున్న వార్తలు రాగా, వాటిన్నింటికీ ప్రస్తుతం షర్మిల చెక్ పెట్టారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దె దించటమే లక్ష్యమని షర్మిల చెప్పారు. కాంగ్రెస్‌లో కలిస్తే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలవని ఆమె భావించారు. కాంగ్రెస్ పార్టీ తమ డిమాండ్‌లకు ఒప్పుకోకపోవడంతో షర్మిల ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. షర్మిల తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన పడే అవకాశం ఉంది.