English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YCP-Zakia Khanam: వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. రెండేళ్ల నుంచి అసంతృప్తిగా జకియా ఖానం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    YCP-Zakia Khanam: వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. రెండేళ్ల నుంచి అసంతృప్తిగా జకియా ఖానం
    వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా..

    YCP-Zakia Khanam: వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. రెండేళ్ల నుంచి అసంతృప్తిగా జకియా ఖానం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    08:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా ఉన్న జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు.

    ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు మండలి చైర్మన్‌కు లేఖ పంపించారు.

    ఈ లేఖను ఆమె తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా మండలి చైర్మన్‌కు చేరవేశారు.

    గత కొన్ని నెలలుగా జకియా ఖానం వైఎస్సార్సీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె రాజీనామా ఆమోదిస్తే , ఉపాధ్యక్షురాలిగా ఆమె పదవిని కూడా కోల్పోతారు.

    వివరాలు 

    2020 జూలైలో గవర్నర్ నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీగా..

    జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి. ఆమెను 2020 జూలైలో గవర్నర్ నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీగా నియమించారు.

    గత రెండేళ్లుగా ఆమె పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం గానీ, ప్రాతినిధ్యం వహించడం గానీ జరగలేదు.

    అంతేకాదు, గతంలో టీడీపీ నేత నారా లోకేశ్ ను ఆమె, కుటుంబ సభ్యులతో కలిసి శాలువా కప్పి సత్కరించారు.

    దీనితో అప్పుడే ఆమె తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారన్న ఊహాగానాలు చర్చకు తెరలేచాయి.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ఆరుగురు ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీకి రాజీనామా 

    2024 అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైఎస్సార్సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

    పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీతో పాటు తమ పదవులను కూడా వదులుకుంటున్నారు.

    ఇప్పుడు జకియా ఖానం రాజీనామాతో కలిపి మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వారిలో చేరిపోయారు.

    ఈ జాబితాలో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌ లాంటి ప్రముఖ నేతలు ఉన్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైసీపీ

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025