NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Protein Rich Vegetarian Foods: ప్రోటీన్ అధికంగా ఉండే 10 వెజిటేరియన్ ఆహారాలు ఇవే..
    తదుపరి వార్తా కథనం
    Protein Rich Vegetarian Foods: ప్రోటీన్ అధికంగా ఉండే 10 వెజిటేరియన్ ఆహారాలు ఇవే..
    ప్రోటీన్ అధికంగా ఉండే 10 వెజిటేరియన్ ఆహారాలు ఇవే..

    Protein Rich Vegetarian Foods: ప్రోటీన్ అధికంగా ఉండే 10 వెజిటేరియన్ ఆహారాలు ఇవే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 04, 2024
    10:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోడిగుడ్లలో విటమిన్లు, మినరల్స్,ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

    కోడిగుడ్లలో ఉన్న ప్రోటీన్ స్థాయిల గురించి చాలా మందికి తెలిసిందే; ఒక్కో సాధారణ గుడ్డులో సుమారు 6.29 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది కండరాల వృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    అయితే, వెజిటేరియన్లు కోడిగుడ్లు తినకపోవచ్చు. కానీ, గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉండే కొన్ని శాకాహార ఆహారాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

    వివరాలు 

    ఎక్కువ ప్రోటీన్ కలిగిన శాకాహార ఆహారాలు ఇవే..

    మీల్‍మేకర్

    మీల్‍మేకర్ (సోయాచంక్స్)లో ప్రోటీన్ ప్రాముఖ్యత అధికంగా ఉంది. 100 గ్రాముల మీల్‍మేకర్‌లో సుమారు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ముఖ్యమైన అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి.

    పనీర్

    పనీర్ (కాటేజ్ చీజ్) రుచికరంగా ఉండటం తో పాటు, ఇది పోషకాలను కూడా కలిగి ఉంది. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 24 గ్రాముల ప్రోటీన్ ఉంది.

    గుమ్మడి గింజలు

    గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 30 గ్రాముల గుమ్మడి గింజలు సుమారు 8 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇవి పాస్ఫరస్, జింక్ వంటి పలు పోషకాలు అందిస్తాయి.

    వివరాలు 

    ఎక్కువ ప్రోటీన్ కలిగిన శాకాహార ఆహారాలు ఇవే..

    సోయాబీన్స్

    సోయాబీన్స్ ప్రోటీన్‌కు మరొక మంచి ఆహారం. ఉడికించిన 100 గ్రాముల సోయాబీన్స్‌లో సుమారు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

    క్వినోవా

    క్వినోవా ధాన్యం ఆరోగ్యానికి మంచిది. ఒక కప్పు క్వినోవాలో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇందులో గ్లిటెన్ ఉండదు, మరియు ముఖ్యమైన అమినో యాసిడ్లను కలిగి ఉంటుంది.

    శెనగలు

    శెనగలు కూడా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలలో ఒకటిగా ఉన్నాయి. ఉడికించిన 100 గ్రాముల శెనగల్లో సుమారు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

    కిడ్నీ బీన్స్ (రాజ్మా)

    ప్రోటీన్ ఫుడ్స్ కోసం చూస్తున్నవారికి కిడ్నీ బీన్స్ మంచి ఎంపిక. 100 గ్రాముల రాజ్మాలో సుమారు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

    వివరాలు 

    ఎక్కువ ప్రోటీన్ కలిగిన శాకాహార ఆహారాలు ఇవే..

    పప్పు ధాన్యాలు

    కందిపప్పు, మినపపప్పు, ఎర్ర కందిపప్పు వంటి పప్పు ధాన్యాలు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల పప్పు ధాన్యాల్లో సుమారుగా 25 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది.

    గ్రీక్ యగర్ట్

    100 గ్రాముల గ్రీక్ యగర్ట్‌లో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది సాధారణ పెరుగు కంటే దాదాపు రెట్టింపు.

    పచ్చి బఠానీలు

    100 గ్రాముల పచ్చి బఠానీల్లో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఫైబర్, ఫోలెట్, మాంగనీస్ వంటి ముఖ్యమైన విటమిన్లు కూడా కలిగి ఉంటాయి.

    ఈ పోషకాహారాల ద్వారా మీరు కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ పొందవచ్చు, వీటిని మీ ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    జీవనశైలి

    Dark Circle Reason: తక్కువ నిద్ర వల్లనే కాకుండా ఈ కారణాల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి లైఫ్-స్టైల్
    Sleep Deprivation : నిద్ర లేమితో బాధపడుతున్నారా ? ఈ చిట్కాలతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు నిద్రలేమి
    Cholesterol : అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది! ఈరోజు నుండే ఈ 5 ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి  గుండెపోటు
    Upma: ఉప్మా అంటే చిరాకా.. ఉప్మా పెసరట్టు, M.L.A పెసరట్టు తింటే వదలరు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025