
Motivation: అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలంటే.. తప్పనిసరిగా ఈ 4 అలవాట్లు మీలో ఉండాలి.. అవి మీలో ఇవి ఉన్నాయా?
ఈ వార్తాకథనం ఏంటి
మీరు గమనించారా?కొంత మంది వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా,ఎంత మందితో ఉన్నా,అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. వాళ్లు మాట్లాడినప్పుడు అందరూ ఆసక్తిగా వింటారు,వారి మాటలకు గౌరవం ఇస్తారు. వారు అడిగిన మాటలకు వెంటనే స్పందిస్తారు,చెప్పిన విషయాలను గౌరవిస్తారు. ఇదియాదృచ్చికం కాదు,అదృష్టం కూడా కాదు. ఇది ఒక ప్రత్యేకమైన అలవాటు,ఒక ప్రవర్తనా శైలి.అందరికీ తెలియని విషయం ఏంటంటే, కొన్ని అలవాట్లు ఉన్నవారిని అందరూ ఇష్టపడతారు, వారి మాటలు ఎంతో శ్రద్ధగా వింటారు. మీరు కూడా గుంపులో గోవిందంలా కాకుండా ప్రత్యేకంగా నిలబడాలనుకుంటున్నారా? మీమాటలకు గౌరవం పెరగాలని కోరుకుంటున్నారా? అయితే ఈ 4 అలవాట్లు మీకు చాలా ఉపకరిస్తాయి. ఇవి మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా,మీరు అందరిలో ప్రత్యేకతతో,తెలివితో నిలబడేందుకు సహాయపడతాయి.ఇప్పుడు ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
వివరాలు
1. మాట్లాడేటప్పుడు పేరు గుర్తుంచుకుని ఉపయోగించండి
మీరు ఎవరో మాట్లాడుతున్నారో వారి పేరును గుర్తుంచి, మాటల సమయంలో వారి పేరుతోనే పిలవడం అలవాటు చేసుకోండి. ఇది చిన్న విషయం లాగే కనిపించవచ్చు కానీ దాని ప్రభావం చాలా గొప్పది. ఒకరిని పేరుతో పిలవడం వారి మనసులో ఒక ప్రత్యేక స్థానం పొందడం లాంటిది. ఇది వారిని గౌరవిస్తున్నట్టు, గుర్తిస్తున్నట్టు భావన కలిగిస్తుంది. పేరు పిలవడం వల్ల ఇద్దరి మధ్య నమ్మకం, స్నేహ బంధం బలపడుతుంది. ఎవరైనా తమ పేరును వినగానే సంతోషపడతారు, అందువల్ల వారు మిమ్మల్ని వెంటనే ఇష్టపడే అవకాశం పెరుగుతుంది.
వివరాలు
2. మాట్లాడటం కంటే ఎక్కువగా శ్రద్ధగా వినండి
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకుంటే,మీరు మంచి శ్రోత కావడం చాలా ముఖ్యం. ఎక్కువ మాట్లాడక, ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని, పూర్తిగా వినడానికి ఎక్కువ శ్రద్ధ పెట్టండి. చాలా మంది తమ గురించి మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, కానీ నిజానికి వినేవారు చాలా అరుదుగా ఉంటారు. మీరు సున్నితంగా, శ్రద్ధగా వింటే, ఎదుటి వ్యక్తి ఆత్మీయతతో తన ఆలోచనలు పంచుకునేందుకు సురక్షితంగా భావిస్తాడు. దీనివల్ల వారి మనసుపై మంచి ప్రభావం పడుతుంది, వారు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు. మంచి సంబంధాలు ఏర్పడటానికి ఈ అలవాటు చాలా అవసరం.
వివరాలు
3. తప్పులు ఒప్పుకోవడంలో నిజాయితీ చూపించండి, ఇతరుల మంచితనాన్ని గుర్తించండి
మీరు చేసిన తప్పును దాచకుండా, తప్పును ఒప్పుకొని వెంటనే క్షమాపణ చెప్పడం చాలా మందిని ఆకర్షిస్తుంది. నిజాయితీ, నిరాడంబరత గుణాలు ప్రజలు ఎంతో ఆరాధించే లక్షణాలు. తప్పులు ఒప్పుకునే ధైర్యం చాల మందికి ఉండదు, అందుకే ఈ లక్షణం మీ ప్రత్యేకతను పెంచుతుంది. అదే విధంగా, ఇతరుల మంచి పనులను గుర్తించి, వారి కృషిని ప్రశంసించడం ద్వారా మీరు వారిని గౌరవిస్తున్నట్టు చూపిస్తారు. ఇది మీరు నిజాయితీగా, మానవత్వంతో, మంచి ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా విశ్వసించి, ఇష్టపడతారు.
వివరాలు
4. సరైన సందర్భాల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రదర్శించండి
హాస్య భావన (సెన్స్ ఆఫ్ హ్యూమర్) ఒక అద్భుతమైన లక్షణం. సరైన సమయంలో సరైన రీతిలో జోకులు చెప్తూ, చక్కటి నవ్వును పంచగలిగే వ్యక్తిని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. నవ్వించడం ఒక కళ, ఇది ఒత్తిడిని తగ్గించి, వాతావరణాన్ని సంతోషంగా మారుస్తుంది. హాస్యం వల్ల వ్యక్తుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఇది ఒక సామాజిక బంధనాన్ని పటిష్టం చేస్తుంది. అయితే, మీ హాస్యం ఎవరినీ బాధపెట్టకుండా, అందరికీ సంతోషదాయకంగా ఉండేలా గమనించాలి. ఇలాంటి హాస్యంతో మీరు మీ గ్రూప్ లో ప్రతిష్టాత్మక వ్యక్తిగా నిలబడతారు. ఈ నాలుగు అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తూ,సమూహంలో ప్రత్యేకంగా నిలబడటానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎంతగానో సహాయపడతాయి.