Low Sugar Fruits: మధుమేహం ఉన్నవారు తినగలిగే ఐదు పండ్లు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది షుగర్ ఉండటం వలన పండ్లు తినడం మంచిదికాదని భావిస్తారు, ఇది నిజం కూడా.
షుగర్ ఎక్కువగా ఉండే పండ్లు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అన్ని పండ్లు ఒకేలా ఉండవు.
షుగర్ తక్కువగా ఉండే పండ్లు కూడా కొన్ని ఉన్నాయి, వీటిని డయాబెటిస్ ఉన్న వారు భయపడకుండా తినవచ్చు.
ఈ పండ్లు తీసుకుంటే రక్తంలో చెక్కర స్థాయి అధికంగా పెరగదు. ఇక్కడ షుగర్ తక్కువగా ఉండే ఐదు రకాల పండ్ల గురించి తెలుసుకుందాం.
వివరాలు
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీలు రుచికరంగా ఉంటాయి. వీటిలో షుగర్ తక్కువగా ఉంటుంది.
వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటంతో, డయాబెటిస్ ఉన్న వారు వీటిని సురక్షితంగా తినవచ్చు. తీపి తినాలనుకున్నప్పుడు బెర్రీలు తినడం మేలు చేస్తుంది.
ఆపిల్
ఆపిల్ లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే. సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచటానికి సహాయపడుతుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు ఆపిల్ ను నిశ్చింతగా తినవచ్చు.
వివరాలు
నారింజ
నారింజ పండ్లలో షుగర్ తక్కువగా ఉండటం వలన ఇది డయాబెటిస్ ఉన్నవారికి సురక్షితం.ఇందులో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అయితే మోతాదుకు మించి తినకుండా, ఒక పరిమితి లోపలే తినడం మంచిది.
దానిమ్మ
దానిమ్మ పండ్లలో షుగర్ తక్కువగా ఉండటంతో పాటు, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బొప్పాయి
బొప్పాయిలో షుగర్ తక్కువగా ఉండటంతో పాటు, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. విటమిన్లు, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన దీన్ని డయాబెటిస్ ఉన్నవారు స్వేచ్ఛగా తినవచ్చు.