ట్రావెల్: చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళు పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్ వాన్ వెళ్లాల్సిందే
మన భారతదేశానికి చాలా చరిత్ర ఉంది. మన దేశంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. బ్రిటిష్ పాలన కాలం నాటిదైతేనేమీ, మొఘల్స్ కాలం నాటి పరిస్థితులైతేనేమీ, అంతకుముందు పరిస్థితులైతేనేమీ.. తెలుసుకోవాలే గానీ గొప్ప గొప్ప చరిత్రలు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అలా చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళు పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్ వాన్ వెళ్లాల్సిందే. కర్జన్ గేట్: బుర్ద్ వాన్ మహారాజు బిజోయ్ చాంద్ మహారాజ్ 1903లో నిర్మించిన గేట్ ఇది. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్, బుర్ద్ వాన్ ప్రాంతాన్ని సందర్శించిన గుర్తుగా దీన్ని నిర్మించారు. ఈ గేట్ మీద కనిపించే రెండు చెక్కిన సింహాల బొమ్మలు, అప్పటి కళా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి.
బుర్ద్ వాన్ లో చూడదగ్గ ప్రదేశాలు
108 శివ మందిరం: ఈ ప్రాంతాన్ని దర్శించడానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీన్నే నవ కైలాస గుడి అని పిలుస్తారు. మహాశివరాత్రి రోజున లైట్ల వెలుతురులో అద్భుతంగా ఉంటుంది. మేఘనాథ్ సాహా నక్షత్ర శాల: నక్షత్రాలు, గ్రహాల గతులను వివిధ రకాల నూతన పరికరాల ద్వారా తెలుసుకోవడానికి ఈ నక్షత్రశాలను ఏర్పాటు చేసారు. 1994లో జపనీస్, ఇండియా ప్రభుత్వాల వారు సంయుక్తంగా దీన్ని నిర్మించారు. బుర్ద్ వాన్ నగరంలో జీబీ రోడ్డులో ఉంటుంది. కళ్యాణేశ్వరి గుడి: బరాకర్ నడి ఒడ్డున ఉన్న ఈ గుడిని మహారాజ హరి గుప్త నిర్మించారు. ఆ తర్వాత 3వ శతాబ్దంలో పంచ్ కోట్ రాజు, ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించారు.